ఫణిగిరి గట్టు వద్ద పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 30

ఫణిగిరి గట్టు వద్ద పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం – పేదల పక్షపాతి ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ డిసెంబర్ 2 (జనంసాక్షి): ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద పేదల ఇండ్ల నిర్మాణ పనులు ఆగిపోయి సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్లి 98 కోట్ల 51 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముందుగా హౌసింగ్ బోర్డ్ నుండి 30 కోట్లు మంజూరు చేయటంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ్యులు సైదిరెడ్డి చిత్రపటాలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మలిదశ ఉద్యమకారుడు 24వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎడ్ల విజయ్, కౌన్సిలర్ గుంజా భవాని ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. నిలిచిపోయిన ఇళ్లను వాటిని1008 డబల్ బెడ్ రూమ్ ఇండ్లుగా మార్చి పేదలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. శాసనసభ్యులు సైదిరెడ్డి కృషి ఫలితంగా పెద్ద ఎత్తున నిధులు రావడం పట్ల పేద ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. శాసనసభ్యులు ఇచ్చిన మాట ప్రకారం నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .అభివృద్ధి లక్ష్యంగా శాసనసభ్యులు పనిచేస్తున్నారని అన్నారు. నిర్మాణ పనులను తొందరగా ప్రారంభించి పేద ప్రజలకు అందివ్వాలని అన్నారు. ఇల్లు లేక అనేకమంది రోడ్ల వెంట జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురవమ్మ, కవిత, నాగమణి, నరసమ్మ, సత్యవతి, బేబీ, మంగమ్మ, వసంత, కురివి రమేష్, వెంకటరమణ, గోపయ్య, మమత, నాగేంద్రం, మంగమ్మ, కిరణ్, భిక్షం, సత్యం తదితరులున్నారు.