భద్రకాళి దర్శనానికి పెరుగుతున్న భక్తులు

సమస్యలు తీర్చాలంటున్న భక్తులు
వరంగల్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): ఒకవైపు మండుటెండలు మరో వైపు వేసవి సెలవులు,దీంతో భక్తుల తాకిడితో అలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఓరుగల్లు చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఓరుగల్లులో శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనంకు భక్తులు అధిక సంఖ్యలో వస్తువుంటారు. అయితే భద్రకాళి ఆలయ పరిస్థితి చూస్తుంటే ఇక్కడి భక్తులకు తాగునీటి కష్టాలు తప్పడంలేదు. వరంగల్‌ నగరంలోని చరిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనంకు రోజు భక్తుల తాకిడి ఎక్కవగా వుటుంది.ఈవేసవి సేలవులల్లో ఇంకా పెరిగింది. కరోనాతో గత రెండేళ్లుగా పెద్దగా ప్రజలు బయటకు రాలేదు. తాజా పరిస్తితుల్లో అందరూ వస్తున్నారు. కాని వచ్చే భక్తులకి కనిస నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. చుట్టు పక్కల గ్రామల నుండే కాకుండా ఇతర రాష్ట్రలనుండి కుడా ఆలయానికి భక్తులు వస్తువుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఉండాటానికి తాగు నీటితో పాటు నిలువ నీడ కూడ ఉండదు. ఓవైపు ఏండా మరో వైపు దాహం, ఇక్కడ ఎర్పాటు చేసిన నల్లాల్లో తాగుదామంటే చుక్క నీరు రాదు. తాత్కలికంగా ఎర్పటు చేసిన రంజనులో నీరు ఉండక పోగా బుజు పట్టినా రంజన్లు దర్శనం ఇస్తాయి. ఇక్కడి వచ్చే భక్తులు పిల్లలతో వచ్చి నీరులేక నాన ఇబ్బందులు పడుతున్నారు. నగరం మొత్తం ఈ భద్రకాళి చెరువు నుండే మంచి నీటి సరఫరా జరుగుతుంది. అయిన కూడా ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు మంచి నీరు అందివ్వలేని దుస్థితిలో ఈ ఆలయం ఉండటం, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పై ఆలయా ఆదికారిని వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు,ఇకానైన అధికారులు స్పందించి ఆలయంకు వచ్చే భక్తులకు నీటి కష్టలు తీర్చాలని భక్తులు కోరుకుంటున్నారు.