భారత రైతు ఉద్యమం పై బ్రిటన్‌ పార్లమెంట్‌ లో చర్చ

మా దేశ అంతరంగిక వ్యవహారం విూరెలా చర్చిస్తారు మండిపడ్డ భరత్‌

న్యూఢిల్లీ, 09 మార్చి (జనంసాక్షి):

భారత్‌లో జరుగుతన్న రైతుల నిరసన, పత్రికా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ జరపడంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గ వ్యవహారాల్లో వేలు పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నామని బ్రిటీష్‌ హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన 90 నిమిషాల చర్చా కార్యక్రమంలో .. లేబరర్‌ పార్టీ, లిబరల్‌ డెమోక్రాట్లు, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీలకు చెందిన పలువురు ఎంపిలు రైతుల నిరసనలపై భారత ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌ పార్లమెంటులో భారతదేశ వ్యవసాయ చట్టాలపై అనవసరమైన, అంతర్గత చర్చలు జరపడాన్ని కేంద్రం వ్యతిరేకించిం దని, బ్రిటన్‌ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది మరో ప్రజాస్వామ్య దేశ రాజకీయాల్లో జోక్యం కిందకు వస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరో దేశంలోని సంఘటనలను తప్పుగా చూపించడం ద్వారా బ్రిటీష్‌ ఎంపిలు ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడవద్దని సూచించింది.