ముఖ్యమంత్రి తోనే మాట్లాడుకుంటాం ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌ ,జనవరి27  (జనంసాక్షి): పీఆర్సీపై ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటా మని సీఎస్‌కు తెలిపినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ రాజేందర్‌ తెలిపారు. పీఆర్సీపై సీఎస్‌తో టీజీవో, టీఎన్జీవో సంఘాల సమావేశం ముగి సింది. అనంతరం రాజేందర్‌ మాట్లాడారు. ’43 శాతానికి తగ ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్‌ను కోరాం. పీఆర్సీపై రాజకీయ నిర్ణయం మాత్రమే జరగాలి. పీఆర్సీ నివేదికను చెత్త బుట్టలో వేస్తున్నాం. ఎవరో కాదు.. ముఖ్యమంత్రి మాత్రమే పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలి. 7.5శాతం పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. మంత్రులు, ముఖ్యమంత్రిని కలసి ఆమోదయోగ్యమైన పీఆర్సీని సాధిస్తాం. ఆర్థిక మాంద్యం మెరుగు పడిన తర్వాత కూడా ఉద్యోగులను చిన్న చూపు చూడ టం అన్యాయం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులకు అన్యా యం జరిగింది. వయో పరిమితి ఈనెల నుంచే అమలు చేయాలి. గ్రాట్యుటీని 20 లక్షలకు పెం చాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా..  ప్రభుత్వంతో ఒకే రకంగా వ్యవహ రిస్తాం. సీఎం దగ్గర మాకు తలుపులు మూసుకుపోలేదు. తెగేదాక లాగం. లౌక్యం పనిచేయ నప్పుడు ఏమి చేయాలో నిర్ణయిస్తాం’ అని రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ‘పీఆర్సీ సాధన కోసం త్వరలో
ముఖ్యమంత్రిని కలుస్తామని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు. నివేదికపై సీఎస్‌ ముందు మా ఆవేదనను తెలిపాం. పీఆర్సీ నివేదిక కాదు.. అది పిసినారి నివేదిక. ముఖ్యమంత్రి ఉద్యోగుల పక్షాన ఉంటారన్న నమ్మకం ఉంది. ఉద్యోగుల్లో అపోహలు వద్దు.. మంచి పీఆర్సీ సాధిస్తాం. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా తయారు చేశారు. నలుగుర్ని కాకుండా.. కుటుంబంలో ముగ్గుర్ని మాత్రమే తీసుకుని నివేదినకు తయారు చేశారని మమత ఆరోపించారు.