రంగనాయక సాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : హరీశ్‌రావు

సిద్ధిపేట : రంగనాయక్‌ సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూరు వరకు 10 నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రంగనాయక్‌ సాగర్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేశారు.
రంగనాయక సాగర్ నుంచి నీరు వదలాలని రైతుల కోరిక మేరకు నీరు వదులుతున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లతో ఎకరం భూమి పారలేదని మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేతలు రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే వారికి కండ్లు ఉండి చూడలేకపోతున్నారని విమర్శించారు.