రణరంగం

గుడ్డు

మాంసం చేపలు
ఏవి పూజ్యనీయమో
ఏవి కావో

ఆకలేస్తే
దొరికింది దొరకబుచ్చుకుని
ఆకలి తీర్చుకునే మనిషికి
ఓ ప్రశ్న

గంటం పట్టుకున్న ప్రతోడు
ఏదో ఒకటి కూసేసి
నోటికాడి బువ్వనే కోస్తుండు

కష్టాలు పూర్వజన్మ పాపం
వల్లె వేసే ప్రబుద్దులకి
ఆహారంపై కన్ను బడింది
ఉల్లిపాయనీ వదలని
కాషాయ ధారులు
వారానికో దేవుడు
తమ బొజ్జ నింపుకునే కుట్రతో
బహుజనుల  ఇంట వేట

వెతలతో బహుజనం
సతమతం
భయంతో అమలు
తిండితిప్పలు మాని
రోగ నిరోధక శక్తికి దూరం
పోతే పాపం
మళ్ళీ పిండ ప్రదానమే
ఆత్మ అంటూ ఏడుపు

సచ్చినోడినీ వదలని
ప్రేతాత్మలు
దేవుడి పేరిట దూతలు
విర్రవీగే ఛానళ్ల
సొల్లు వాగుళ్ళు
హేతువుండని వాదనలో
బహుజనం విలవిల

ఉన్నాడో లేడో
తెలీని వాడికోసం
తిండి మానమనే
ఆహార చోరులారా
బహుజనమే బలహీనమైతే
మీ ముద్ద కూడా పండదురా

పరుల తిండి పై దాడి
జంతు మనస్తత్వం
అదే నరనరాన జీర్ణించుకున్న
కాషాయం
కషాయం కొట్టించి
షా పెట్టక తప్పదు
బంటుల చేతిలో చదరంగం
రణరంగం రౌండప్
భవిష్యత్తు రౌతులే బహుజనులు
– గిరిప్రసాద్ చెలమల్లు 9493388201
201 క్లాసిక్ అవెన్యూ మియాపూర్
హైదరాబాద్ 500049