*రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*

మునగాల, జనవరి 03(జనంసాక్షి): రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోంపొంగు రాధాకృష్ణ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో (ఏఐఆర్టి డబ్ల్యూఎఫ్) తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్సీ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో “రవాణా రంగ కార్మికుల సంఘర్ష్ యాత్ర ” పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఎస్ రాధాకృష్ణ, బి స్వరాజ్యం మాట్లాడుతూ, నేడు 4వ తారీఖున సూర్యాపేటలో ఉదయం 10 గంటలకు జరుగు రవాణా రంగ కార్మికుల సంఘర్షయాత్రకు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో,  ట్రాక్స్,  గూడ్స్, రవాణా, స్కూల్ బస్సులువంటి వాటిలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో ఈ రంగంలో స్వయం ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయబోగా వివిధ రకాల వేధింపులు గురిచేస్తూ ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనువైన స్థలాల్లో అడ్డాలను ఏర్పాటు చేయాలని వీరు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వి.నాగరాజు,  ఎస్.కె సైదా, సిహెచ్ వెంకటేశ్వర్లు, జె. తిరపయ్య, ఎల్ బిక్షం పాల్గొన్నారు.