రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి,

గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలని గ్రామ సెక్రటరీ కి వినతి పత్రం.

 

కోడేరు (జనం సాక్షి) ఆగష్టు 05 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.వాటిలో జనాభా ప్రాతిపదికన మరియు వైశాల్యం లో రాజాపురం గ్రామం పెద్దది గత 2017 లో రాజాపూర్ గ్రామాన్ని కొత్త మండలం గా ప్రకటించాలని కోరుతూ ప్రజా ప్రతినిధుల కు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అంద జేయడం జరిగింది.ఆ పర్యాయం లో మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించలేదు తర్వాత విడతలో రాజాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజాపురం గ్రామాన్ని ఏదుల గ్రామంలో విలీనం చేయాలని కొంతమంది పెద్దలు చూస్తున్నారు. మండల కేంద్రంగా ప్రకటించాలని మా గ్రామాన్ని నాగర్ కర్నూల్ జిల్లా లోనే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నామని గ్రామ యువకులు ప్రజలు తెలిపారు. మొదటగా రాజాపురం గ్రామం లో గ్రామ సభ పెట్టి ప్రజల సమక్షంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి రాజాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా మండల తీర్మానం చేయాలని గ్రామపంచాయతీ సెక్రటరీ నరసింహ కు వినతి పత్రం అందజేయండం జరిగిందని ప్రజలు యువకులు తెలిపారు.ఎట్టి పరిస్థితి లో కూడా ఏదుల గ్రామంలో మా గ్రామాన్ని విలీనం చేయకూడదని నిరుద్యోగ యువత ఉద్యోగాలు విషయం లో స్థానికత కోల్పోయే ప్రమాదం ఉందని కాబట్టి వనపర్తి జిల్లా లో మా రాజాపుం గ్రామాన్ని కలపొద్దని గ్రామ యువకులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలకిష్టయ్య, ఆర్ కృష్ణ, పల్లె మూర్తి, సిరాజ్ ద్దిన్ నరసింహ,సి నరసింహ,
సి శేఖర్, ఆర్ వెంకటయ్య, ఆంజనేయులు, పగడాల కురుమూర్తి, రాములు, దేవమ్మ, నరసమ్మ, సి ఎల్లమ్మ, బాలమ్మ, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.