రుద్రూర్ లో పెన్షన్ కోసం పడిగాపులు,

రుద్రూర్(జనంసాక్షి):
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పక్కనే పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఉదయం నుంచి అవస్థలు పడుతున్న , గ్రామ పాలకులు, సంబంధిత అధికారులు  ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, 60 సంవత్సరలు పై బడిన, మరియు వికలాంగులు, ఒంటరి మహిళలను గంటల తరబడి వేచి ఉంచటం ఏమిటని గ్రామస్తులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం  రుద్రూర్ గ్రామంలో నీరు గారులే చేస్తున్నది ఎవరు , పెన్షన్ కోసం పెన్షన్ లబ్ధిదారులు ఉదయం నుంచి పడిగాపులు  పడుతున్న  ,మధ్యాహ్నం  1:30 గంటల వరకు అధికారులు  రాకపోవడం,  ప్రతినెలా సంబంధిత శాఖ అధికారులు ఇలాగే ఇబ్బందుల పాలు చేస్తున్నారని పింఛన్ లబ్దిదారులు వాపోయారు.
ఈ విషయం పై గ్రామ పాలకులు, అధికారులు వెంటనే  స్పందించాలని గ్రామస్తులు కోరారు