రైతాంగ వ్యవిరేక విధానాలపై పోరుబాట


ఆర్మూర్‌ బీజేపీ పట్టణ శాఖ ఆందోళన
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష
నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): ఆర్మూర్‌ భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతారగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్మూర్‌ పట్టణ, మండల కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పాలెపు రాజ్‌ కుమార్‌, లోక నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణలో ఉన్న రైతులను బంగారు రైతులుగా మారుస్తామని చెప్పి రైతు కష్టం తన కష్టంగా భావిస్తానని చెప్పి మాయమాటలు చెప్తూ రైతులకు ఎటువంటి సహాయ సహకారం అందించకుండా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి తెలంగాణ రైతులనే కాదు తెలంగాణ ప్రజలు సైతం మోసం చేస్తున్నాడని, మోసపుచ్చుతూ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే ఇస్తానని చెప్పి చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకుండా తెలంగాణలో ఉన్న రైతులకు అన్యాయం చేస్తున్నారని, యూరియా ఉచితంగా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని దీనికి నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతారగ సమస్యలను పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని లేనట్లయితే రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు, రైతులు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టే కార్యక్రమం దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సత్యాగ్రహ దీక్ష విరమణకు రాష్ట్ర నాయకులు లోక భూపతి రెడ్డి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌ బిజెపి పట్టణ అధ్యక్షుడు, ఆర్మూర్‌ మండల అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌, రోహిత్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా ఆర్మూరు పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు దొర్ల నారాయణ, రాజారెడ్డి, ఉపాధ్యక్షులు పున్నం రాజేందర్‌, శేషగిరి లింగం, చిట్టి భజన్న, గోవింద్‌ పేట్‌ ఎంపీటీసీ రాజ్‌ కుమార్‌, ఆర్మూరు పట్టణ, ఆర్మూరు మండల బీజేవైఎం అధ్యక్షులు కలిగోట ప్రశాంత్‌, నరేష్‌ చారి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఉదయ్‌ గౌడ్‌, పసుపుల సాయికుమార్‌, పట్టణ ఉపాధ్యక్షులు భరత్‌, పెరంబదూర్‌ వాసు, గిరిజన మోర్చా ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు కేలోత్‌ పీర్‌ సింగ్‌, భూపేందర్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.