రైతుల సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గతంలో కరోనా కారణంగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, ఇప్పుడు అదే పద్దతిలో మళ్లీ గ్రామాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. రైతువేదికలతో రైతుల్లో మార్పు రానుందని, వారుతమకుతాముగా చర్చించుకునే అవకాశం వచ్చిందన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు లాభం పొందాలన్నారు. వద్దన్నా మక్కలు వేసినా సిఎం కెసిఆర్‌ పెద్ద మనసుతో కొనుగోళ్లకు అంగీకరించారని అన్నారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. అవసరమైన చోట కొనుగోలు కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులు పండిస్తున్న సన్నరకం వరికి మద్దతు ధర రూ.2500 కేటాయించాలని పలువురు కోరగా రైతుల సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రైతులు పండించిన పంటను కోనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని సూచించారు.