రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  దేప భాస్కర్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్  డివిజన్ రామకృష్ణాపురం డివిజన్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని సరూర్ నగర్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన  వ్యక్తం చేసి అనంతరం ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా రైతుల పక్షాన నిరంకుశ ధరణి తో కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుదని అన్నారు.
ధరణి పోర్టర్ లో అవకతవకలు  పంట రుణమాఫీ పై రైతు బీమా రైతుబంధు అందని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా  నిలుస్తుందని అన్నారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందుకే రైతుల కోసం రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతు కోసం రైతు సంక్షేమం కోసం *శ్రీ రాహుల్ గాంధీ* గారు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించడం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు *చిలుక ఉపేందర్ రెడ్డి,నల్లేంకి ధనరాజ్ గౌడ్, పంతంగి రాము గౌడ్, గట్ల రవీంద్ర, తలాటి రమేష్ నేత ,మహమ్మద్ ఇస్థియాక్ గుల్షన్, బొడ్డుపల్లి మహిందర్, సుధకర్ గౌడ్, యాదగిరి గౌడ్, కరుణకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్,  శివ, శేఖర్ ముదిరాజ్, కల్యాణ్ యాదవ్, శ్రీశైలం,పురుషోత్తం, శ్రీకాంత్ రెడ్డి, విప్లవ రెడ్డి,జగదీష్, చింతకింది రంజిత్,కౌషిక్, శ్రావణ్ కురుమ, అంజి,చారి,అశోక్,సతీష్,కుమార్,సత్యనారాయణ,మహేష్,అరవింద్, చిన్న,నాయిం,సైదులు ,అరుణ,సుశీల,రవళి
 కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు