లైగర్‌ ప్రమోషన్‌లో విజయ్‌ బిజీ

మరో రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల
ఈ మధ్య కాలంలో లైగర్‌ బృందం చేస్తున్న ప్రమోషన్లు మరే సినిమా చేయలేదు. విడుదలకు నెల రోజుల ముందు నుండి ప్రమోషన్‌లను జోరుగా జరుపుతుంది. విజయ్‌, అనన్య జనాల మధ్యలోకి వెళ్లి ప్రమోషన్లను జరుపుతూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు.తాజాగా విజయ్‌ దేవరకొండ ప్రమోషన్‌లో భాగంగా పాట్నా నగరానికి వెళ్లాడు. అయితే మార్గ మధ్యలో పాట్నాలో ఎంతో ఫేమస్‌ అయిన ’గ్రాడ్యుయేట్‌ చాయ్‌ వాలీ’కి వెళ్ళి విజయ్‌ టీ తాగాడు. అంతేకాకుండా వాళ్ళతో కాసేపు ముచ్చటించి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది. ’అఫత్‌’ అనే సాంగ్‌ ను మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేయగా… ఇందులో విజయ్‌ మరింత మాస్‌ లుక్‌ లో కనిపించాడు. ఈ పాట ప్రస్తుతం కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ లో విజయ్‌, అనన్యలు మరింత రొమాంటిక్‌?గా కనిపిస్తున్నారు. అలాగే లిరిక్స్‌ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే లైగర్‌ సినిమాకు సంబంధించి ’అక్డీ పక్డీ’ సాంగ్‌ అనే సాంగ్‌ రిలీజ్‌ కాగా.. ఇది ప్రస్తుతం యూట్యూబ్‌ ను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా పాన్‌ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కిన ఈ మూవీ ఆగష్టు 25న విడుదల కానుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్‌ బాక్సర్‌ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ కీలకపాత్రలలో నటిస్తున్నారు