వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల ఎంపిక సరిగాలేదు

ఏటూరునాగారం,ఆగష్టు5(జనంసాక్షి):-

వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని స్థానిక  తెరాస నేతలు ఏటూరునాగారం తహశీల్దారుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెరాస జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి మాట్లాడుతూ జూలై నెలలో వచ్చిన గోదావరి అధిక వరదల వల్ల కట్టు బట్టలతో పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధితులను గుర్తించటంలో అధికార యంత్రాంగం విఫలయ్యారన్నారు.దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన అధికారుల తీరు ఉందని విమర్శించారు.వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికి 10000/- రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన మాట విదితమే… కానీ అధికారులు వారి ఇష్టనుసారం బాధితులను ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారన్నారు.మళ్ళీ వరద ముంపు బాధితుల విన్నపం మేరకు అధికారులు సర్వే చేసి మిగిలిన బాధితులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమములో
తెరాస జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి,తెరాస ఏటూరునాగారం టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా,
రామన్నగూడం ఎంపిటిసి అల్లి సుమలత శ్రీనివాస్,సర్పంచ్ దొడ్డ కృష్ణా,రాంనగర్ కోయాగూడ
ఉప సర్పంచ్ గార నాగేష్, సీనియర్ నాయకులు గారా ఆనంద్
 
Attachments area