విఆర్ఎ ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి

మోత్కూరు ఆగస్టు 5 జనంసాక్షి : తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు 12 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి వీడాలనీ, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బోల్లు యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున విఆర్ఏ లు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సీపీఎం పార్టీ బృందంతో సందర్శించి మాట్లాడుతూ…అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏ లకు పే స్కెల్ అమలు చేస్తామనీ హామీ ఇచ్చారని, తక్షణమే అమలు చెయ్యాలని కోరారు. 2017 పిబ్రవరి 24 న ప్రగతి భవన్ లో వీఆర్ఏ సంఘాలతో సమావేశమై, పదోన్నతులు కల్పిస్తామని, 55 సం రాలు దాటిన వారికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, హామీ ఇచ్చి 5 సం రాలు, దాటిన నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం మొండి వైఖరినీ వీడి, ముఖ్య మంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చెయ్యాలని, వీఆర్ఏ లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, పదవోన్నతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, టౌన్ కమిటీ సభ్యులు కందుకూరి నర్సింహ, మెతుకు అంజయ్య, విఆర్ఎ లు పాల్గొన్నారు.