విపక్షాల ఐక్యతకు పరీక్ష ! 

సార్వత్రిక ఎన్నికలకు  ఓ రెండేళ్ల ముందు జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికలతో బిజెపి తీరుగలేని ఆధిపత్యం సాధించింది. బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ తొడగొట్టిన పార్టీలన్నీ చతికిల పడ్డాయి. మోడీ, అమిత్‌ షాల వ్యూహం ముందు ఇప్పుడు ఎవరి వ్యూహం పనిచేయడం లేదు. ఈ క్రమంలో త్వరలో జరగగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయన్నదే ముఖ్యం. ఎందుకంటే మోడీ వ్యూహం ఇప్పటికే సిద్దం అయి ఉంటుంది. అది ఏంటన్నది త్వరలో బయటకు రానుంది. ఈ క్రమం లో విపక్షం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు ఉంటున్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌తో కలసి ఉమ్మడి అభ్యర్థిని నియమించే విషయంలో ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటికీ ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. అలాగే ఎలక్టోరల్‌ కాలేజీ లెక్కలు వేయడం లేదు. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ కూడా అప్పుడే తన మనసులో ఏముందో చెప్పడం లేదు. అందరికీ ఆమోదయోగగ్యమైన నాన్‌ పొలిటిక్‌ వ్యక్తిని నిలిపితే ఎలా ఉంటుందన్న ఆఓలచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడితే తప్ప రాకీయ పార్టీలు ముందుకు కదలేలా లేవు. ఇకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి కూడా బిజెపిలో కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరిని నియమిం చాలో మోడీ నిర్ణయిస్తారని అందరికీ తెలుసు. గతంలో ఎవరూ ఊహించని విధంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెరపైకి తెచ్చారు. నిజానికి అద్వానీని అంతా దేశాధ్యక్షుడిని చేస్తారని ఊహించారు. విపక్షనేతలు కూడా ఇదే ఆశించారు. కానీ మోడీ అనూహ్యంగా అద్వానీని పక్కన పెట్టి రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెరపైకి తెచ్చారు. అలాగే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎంచుకున్నారు. ఈ రెండు పోస్టులు ఎవరూ ఊహించ కుండానే ఎంపిక జరిగిపోయింది. మోడీ అనుకున్న మేరకు నిర్ణయించుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా కొత్త పేర్లు బయటకు రావచ్చు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానాలైన ఈ రెండు పదవులకు జరగబోయే ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక అధికార ఎన్డీయే కూటమికి, విపక్షాలకు మధ్య బలపరీక్షగా మారే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎవరన్న ఆసక్తి సహజంగానే వస్తోంది.  మొన్నటి ఎన్నికల ఫలితాలకు ముందు అనూమ్యంగా బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నేత గగులాంనబీ ఆజాద్‌ల పేర్తు వచ్చాయి. అయితే ఇవి మోడీ వర్గం నుంచి కాకుండా ప్రశాంత్‌ కిశోర్‌ వదిలిన బాణాలుగా వచ్చాయి. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థులను గెలిపించుకోవ డానికి మోడీ గెలుపు వ్యూహాలను సిద్దం చేసుకునే ఉంటారు. లోక్‌సభ,రాజ్యసభలో పార్టీకి తగినంత సంఖ్యా బలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి ఎలక్టోరల్‌ కాలేజీలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావడమే ఇందుకు కారణం. రాష్ట్రపతిని ప్రత్యేక ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకొంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది. ఒక రాష్టాన్రికి, మరో రాష్టాన్రికి చెందిన ఎమ్మెల్యేల మధ్య ఓటు విలువలోనూ తేడాలుం టాయి. ఆయా రాష్టాల్ర జనాభా, ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఓటు విలువ మారుతుంది. సాధారణంగా రాష్ట్ర జనాభా ఎక్కువ ఉంటే ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. పార్లమెంటు ఉభయసభల ఎంపీల ఓటు విలువ సమానంగా ప్రస్తుతం 708గా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీ వేసిన ఓట్ల మొత్తం విలువ లెక్కగట్టి ఎవరికి ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో తెలంగాణ,ఎపి, బెంగగాల్‌, పంజాబ్‌,రాజస్థాన్‌, కేరళ, తమిళనాడు, ఢల్లీిల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందులో ఎపిలో జగన్‌ ప్రభుత్వం మోడీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు. తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వం ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా మారారు. ప్రస్తుతం రాష్టాల్ల్రో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిగి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కంటే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలకు కలిపి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉనట్లు తెలుస్తోంది. అయితే దీనిని లెక్కలు వేయాల్సి ఉంది. అంటే కాంగ్రెస్‌, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉమ్మడి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే గెలిచే అవకాశం ఉంటుం దా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికకు తగినంత సంఖ్యా బలం ఉంది. కానీ మొత్తంగా బీజేపీ వందకు పైగా ఎమ్మెల్యే సీట్లను కోల్పోవడం తో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిందన్న లెక్కలు వేస్తున్నారు. యూపీలో కూడా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గడంతో ఓటు విలువ పరంగా బీజేపీ నష్టపోయింది. 5 రాష్టాల్లో మూడిరటిని ఒంటి చేతితో గెలుచుకున్న బీజేపీ, హంగ్‌ వచ్చిన గోవాలో సైతం స్వతంత్రుల మద్దతు తీసుకొని, మరోసారి పీఠమెక్కడానికి సిద్ధమవు తోంది. పంజాబ్‌ ఫలితం ఆప్‌కు అనుకూలంగా మారింది. దీంతో పంజాబ్‌, ఢల్లీిలో ఆప్‌ ఆధిక్యంలో ఉంది.యూపీలో 322 సీట్ల స్థాయి నుంచి బీజేపీ కొన్ని పదుల సీట్లను కోల్పోయింది. అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) మునుపటి కన్నా 70 సీట్లకు పైగా గెల్చుకున్నది. దీంతో అఖిలేశ్‌ సీట్లు కూడా విపక్ష ఖాతా లోకి రానున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు ఇదే సరైన సమయం. రాష్ట్రపతి ఎన్నిక ల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఎన్‌డిఎకు పోటీ ఇస్తరా లేదా అన్నది చూడాలి. ఎన్డీయే అభ్యర్థి నేరుగా విజయం సాధించాలంటే దానికి మరో రెండు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ, ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ పార్టీల మద్దతు కీలకం కానున్నది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీకి మద్దతిచ్చాయి. వీటితో పాటు టీఆర్‌ఎస్‌ కూడా అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చింది. కానీ వివాదాస్పద సాగు చట్టాలు, కేంద్రం రైతు వ్యతిరేక చర్యలు, సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ దెబ్బ తీస్తుండటంతో బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌ చేరిపోయింది. అలాగు విపక్షాలు ఆమోదయోగ్య మైన అబ్యర్థిని నిలబెడతారా లేదా అన్నది చూడాలి. విపక్షాలు ఐక్యతకు కూడా ఇదో పరీక్ష. ఇక్కడి నుంచే ఇక ఉమ్మడి ఎజెండాతో ముందుకు సాగితే సానుకూల అవకాశాలు ఉంటాయి. మోడీని ఎన్నికల్లో మాత్రమే ఎదరించకుండా..మోడీ విధానాలను ఎదరించేందుకు ఇక నిరంతరంగగా శ్రమించాల్సిన బాద్యతను తీసు కుంటే తప్ప ప్రజలు నమ్మరు. అందుకు ప్రాంతీయ పార్టీలు అనుసరించే వ్యూహం ఏంటన్నది రాష్ట్రపతి ఎన్నికతో బయటపడనుంది.