విభజన హావిూలు..సమస్యలు గాలికి !

ఎపి విభజన జరిగాక ఇరు రాష్టాల్రు తమ మానాన తాము ఉంటున్నారు. కేంద్రం నిర్మాణాత్మక సహకారం అందించలేక పోయింది. ఎపి రాజధానిపై కేంద్రం చేతులెత్తేసింది. విశాఖ స్టీల్‌ ఆందోళనకు ఏడాది అయినా పట్టించుకోలేదు. కడప ఉక్కును పక్కన పెట్టారు. బయ్యారం ఉక్కు ఊసే లేదు. ఇక ఏంచేశారో చెప్పడానికి ఏవిూ లేదు. ఆత్మనిర్భరభారత్‌ పేరుతో మోడీ పదేపదే మాటలు వల్లిస్తున్నా ప్రయోజనం శూన్యం అని తేలింది. కనీసం ఉభయరాష్టాల్ర మధ్య సమస్యలను పట్టించుకోలేదు. ఈ క్రమంలో తాజాగా ముగ్గురితో కమిటీ వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీ ఏం చేస్తుందో మున్ముందు తెలియనుంది. ఈ కమిటీకి ఉన్న అధికారాలు ఏమి ఉంటాయో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా, గోదావరి జలవివాదాన్ని కూడా సత్వరంగా పరిష్కరించాలన్న ఆలోచన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడీ కమిటీ కూడడా కంటితుడుపు చర్యగా ఉంటుందనడంలో సందేహం లేదు. విభజన సమస్యల పరిస్కారం పేరుతో కమిటీ వేసినా..విభజన హావిూలపై మాత్రం కేంద్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఈ రెండు రాష్టాల్రు నేరుగానే పోరాడాల్సిన అవసరం వచ్చింది. సమస్యలను నాన్చకుండా త్వరగా పోరాడితేనే మంచిది. ఇకపోతే వివిధ సమస్యలపై ఇటు తెలంగాణ నుంచి కెసిఆర్‌ గట్టిగానే పోరాడుతున్నా..ఎపిలో మాత్రం నేతలు నిలదీయలేక పోతున్నారు. చంద్రబాబు, కెసిఆర్‌లు కేంద్రంతో సయోధ్యతో ఉన్నా కూడా లాభం చేకూరలేదు. స్థానిక బిజెపి నేతలు కూడా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో సమస్యలు ప్రస్తావించి సాధించే తెలివిని ప్రదర్శించలేదు. దూకుడు రాజకీయాలతో, వారు చేస్తున్న విన్యాసాలు అభాసుపాలు చేస్తున్నాయి. మొత్తంగా విభజన వల్ల తెలంగాణ కొంత పురోగమిస్తున్నా ఎపిలో మాత్రం అలాంటి ఛాయలు కానరావడం లేదు. నాయకత్వ లోపం కూడా కారణంగా భావించాలి. తాజాగా కెసిఆర్‌ మోడీపై యుద్దం ప్రకటించినా ఎంత పట్టుదలగా ఉంటారో తెలియదు. నిజానికి గత పార్లమెంట్‌ ఎన్నికల ముందే ఆయన ఈ ప్రకటన చేసినా ముందుకు కదలలేదు. దీనికి తోడు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా పెద్దగా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో గత విభజన సమయంలో ఇచ్చిన హావిూలను ముందుకేస్తే..అసలు కేంద్రం ఎందుకిలా వ్యవహరించిందో అర్థం కావడం లేదు. విభజన హావిూలు అమలు చేయకుండా కేంద్రం రాష్టాన్రికి ద్రోహం చేసినా వైసిపి, తెలుగుదేశం పార్లీలు పెద్దగా పోరాడలేదు. మోడీ బురిడీ కొట్టించి కాలయాపన చేయడంతో ఎనిమిదేళ్లు గడిపేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రం విధానాలపై రాజీపడకుండా ఎపి నేతలు పోరాడలేక పోతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా కేంద్రం లాభపడుతోంది. గతంలో దీర్ఘకాలం బిజెపితో టిడిపి సాగించిన పొత్తు రాజకీయాలు కూడా దీనికి ఒక కారణం. ఇకపోతే అధికారంలోకి రాకముందు జగన్‌ ఇచ్చిన అనేకానేక సమస్యలు ఆచరణకు నోచుకోవడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడానికి, మూసేయడానికి వెనకాడలేదు. ఇప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. కృష్ణపట్నం జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేస్తున్నది. గంగవరం పోర్టును అప్పగించేశారు. సహకార చెక్కర, పాలసంఘాలను రెండు పార్టీలు దెబ్బతీశాయి. అందువల్ల మౌలికమైన ఆర్థిక విధానాలలో ఇద్దరికీ తేడా లేదు. తెలుగు ప్రజల భావోద్రేకాలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణను మాటవరసకు వ్యతిరేకిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడి తెగువతో పోరాటానిముందుకు రావటం లేదు. ప్రత్యేకహోదాను పక్కనపెట్టి ఇద్దరూ కీచులాడుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను పోటీలు పడి ప్రకటిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాటగా వీరి తీరున్నది. నరేంద్రమోదీ నాయకత్వంలో బిజెపి రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు
పూర్తికావస్తున్నా తెలుగు రాష్టాల్రకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోగా పొగపెట్టారు. ప్రస్తుత సందర్భంలో నరేంద్రమోదీ ఇకముందు ఏదో చేస్తారనో ఆశలు పెట్టుకుంటే అంతే సంగతలు ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాల భవిష్యత్‌ ఏమిటన్నది ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి కావస్తోంది. అప్పటికీ ఇప్పటికీ ఆయన ధోరణి మారలేదు. తాను దేశ ఉద్దరణకు అవతరించిన అపర మేధావిగా ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రమంత్రులు ఎందరు ఉన్నా వారంతా డవ్మిూలే. అంతేగాకుండా అంతా నమో అంటూ స్మరించే స్థాయికి చేరుకునేలా చేశారు. తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన భక్తగణాన్ని దేశవిదేశాల్లో రూపొందించుకోవడం లోనూ మోడీ విజయం సాధించారు. అందుకే మోదీని తీవ్రంగా విమర్శించేవారిని మించి ఆయనను గుడ్డిగా సమర్థించేవారు ఎక్కువగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి బలం తానే అన్న రీతిలో ఇప్పుడు పార్టీ పరిస్థితి తయారయ్యింది. మోదీ, ఆయన విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నా దానిని ఆయన లెక్క చేయడం లేదు. ఆర్థిక విధానాలు సవ్యంగా ఉన్నాయని, ధరలు అదుపులో ఉన్నాయని, నిరుద్యోగం నియంత్రణలో ఉన్నదని చెప్పేందుకు విపరీతమైన ప్రచారాలు వివిధ రూపాల్లో సాగుతున్నాయి. మోదీ నిరంకుశ, ఏకపక్ష విధానాల వల్ల దేశ సమస్యలే కాదు..ఉభయ తెలుగు రాష్టాల్రకు కూడా సవిూప దూరంలో పరిష్కారం అవుతాయనడానికి లేదు. ప్రధానమంత్రి సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నారనడానికి లేదు. రాష్టాల్రను గౌరవిస్తున్నానని చెప్పుకోవడం మినహా వారిని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగిస్తుంటారు. మోదీ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు కేంద్ర ఏజెన్సీలను అప్పుడప్పుడూ ప్రయోగి స్తూనే ఉంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణితో ఉన్న నేత మోడీ. ఇకముందు కూడా ఇలాగే ఉంటారు. తను చేయాలనుకున్నదే చేస్తారు. చెప్పదల్చుకున్నదే చెబుతారు. నోట్లరద్దు బాధలు, జిఎస్టీ వాతలు, పెట్రోదరల బాధలు, గ్యాస్‌ మంటలు అయనకు పట్టవు. అలాగే దేశ ప్రజల సమసల్యు పెద్దగా పట్టించుకోరు. అలాగే ఉభయ రాష్టాల్ర సమస్యలను కూడా పట్టించుకుంటారన్న నమ్మకం కూడా లేకుండా పోయింది. అందుకు ఈ ఎనిమిదేళ్ల కాలమే నిదర్శనం. అందువల్ల ఇరు రాష్టాల్ర నేతలు బాగా ఆలోచించి ముందుకు సాగాల్సిన సమయమిది.