వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సిఎం కెసిఆర్‌


డీసీసీబీ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి
మహబూబాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లాలోని కేసముద్రంలో గురువారం డీసీసీబీ బ్రాంచ్‌ ను ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్‌ రావు, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు రుణ పరిమితి సీలింగ్‌ పదిలక్షలకు పెంచడం సంతోషకరం అన్నారు. ఇప్పటికే మహిళలకు ఏడు కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం.5 0వేల రూపాయలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తూ వారి రుణభారాన్ని తగ్గిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. డీసీసీబీ అందిస్తున్న సేవలను మరింతగా రైతుల వద్దకు తీసుకెళ్లాలి. వారికి అవగాహన కల్పించి ఈ సేవలు వినియోగించుకునేలా సహకరించాలన్నారు. రైతులు కూడా డీసీసీబీ ద్వారా అందే సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.