శతకోటి వందనాల వేళ..మరింత అప్రమత్తం అవసరం

కరోనా ముప్పు నుంచి ఇంకా మనం బయటపడలేదు
మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాల్సిందే
న్యూఢల్లీి,అక్టోబర్‌22(జనంసాక్షి ): శతకోటి సంబరం వేళ మానవాళికి కరోనాముప్పు ఇంకా తొలగిపోలేదు. రూపు మార్చుకొంటున్న వైరస్‌తో అమెరికాలో 90 వేలు, బ్రిటన్‌లో 50 వేలు, రష్యాలో 33 వేలకు పైగా రోజువారీ కేసులు వస్తున్నాయని మర్చిపోకూడదు. అగ్రరాజ్యాలలోనే పరిస్థితి ఇలా ఉంటే, మామూలు దేశాల పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇప్పటికే మళ్లీ వైరస్‌ కొత్తగా విజృంభిస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో విమనాల నిలిపివేత, స్కూళ్లు మూసివేత మళ్లీ హెచ్చరికలుగా చూడాలి. మనమంతా మళ్లీ మరింత అప్రమత్తంగా ఉండాలి. థర్డ్‌ వేవ్‌ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్న మన దేశంలో కరోనా టీకాల రెండు డోసులూ ఇప్పటికి చేరింది 30 శాతం మందికే అంటే 29.1 కోట్ల మంది మాత్రమే పూర్తిగా తీసుకున్నారని గుర్తించాలి! ఆ సంగతి మనం మర్చి
మనం అజాగ్రత్తగా ఉండకూడదన్న హెచ్చరికను కూడా మననం చేసుకోవాలి. అర్హులందరికీ టీకా లక్ష్యం చేరితే, పొరుగుదేశాలతో పాటు ఆఫ్రికా లాంటి చోట్లకు మన ’వ్యాక్సిన్‌ మైత్రి’ దౌత్యంతో స్నేహవారధి నిర్మించుకోవచ్చు. అసలైన ప్రయాణం ఇంకా ముందుంది. మన దేశంలో ఈ జనవరి 16న మొదలైన ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ విజృంభించిన ఈ ఏడాది వేసవిలో టీకాల కొరత నుంచి ఇప్పుడు టీకాలు దండిగా దొరికే రోజుల దాకా అనేక సంఘటనలు చూశాం. తొలి డోసు అనుమానాల నుంచి మూడోదైన బూస్టర్‌ డోస్‌కు సై అనే దాకా వచ్చాం. నెల మొత్తం విూద 7 కోట్ల డోసుల తయారీకే ఆపసోపా లు పడిన క్షణాల నుంచి ఇప్పుడు నెలకు 20 కోట్ల డోసుల తయారీకి పురోగమించాం. కావాల్సిన ఔషధాలు, ఆక్సిజన్‌ దొరక్క అవస్థ పడిన రోజులు పోయి… కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్‌`వి సహా అనేక టీకాలు అందుబాటులో ఉండడం చూశాం. పడవలు, డ్రోన్లతోనూ టీకాల రవాణా చేశాం. తొలి రోజుల్లో సమస్యలె దురైనా, దేశీయంగా రూపొందించిన కోవిన్‌ యాప్‌ ద్వారా టీకాలపై సమాచారం, తక్షణ డిజిటల్‌ సర్టిఫికెట్లు విజయవంతంగా అందుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 కోట్ల డోసుల విజయం ఓ మైలురాయిగా చెప్పుకోవాలి. మరిన్ని సవాళ్ళు ముందున్నా..అదిగమిస్తామన్న భరోసా ఏర్పడిరది. ఈ ఏడాది చివరి కల్లా 100 కోట్ల వయోజన భారతీయులకు పూర్తిగా టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అనుకున్నంత సులభం కాదు. అది సాధించాలంటే, టీకా పక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఈ బృహత్తర యజ్ఞంలో ఇప్పటికి మన దేశంలోని వయోజనుల్లో 18 ఏళ్ళ వయసు దాటినవారు నూటికి 75 మందికి కనీసం ఒక డోసయినా టీకా వేసినట్టయింది. అదే సమయంలో మరో 25 శాతం మంది వయోజనులు ఇంకా టీకా ఫస్ట్‌ డోస్‌కే నోచుకోవాల్సి ఉంది. నిజానికి రెండు డోసులూ వేస్తేనే టీకా వేయడం పూర్తయి, కరోనా నుంచి పూర్తి రక్షణ వచ్చినట్టు లెక్క. అందుకే, శతకోటి డోసులు పూర్తయినంత మాత్రాన శతాధిక కోట్ల భారతీయులకూ టీకా వేయడం పూర్తయినట్టు కాదు. తలా రెండు డోసులు పడేవరకూ ప్రతి ఒక్కరూ సురక్షితమూ కాదు. అయితే ఈ వందకోట్ల డోసుల సంఖ్య మాత్రం మనందరిలో భరోసాను ఇచ్చింది. మనవద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కొరత లేదన్న భరోసా ఏర్పడిరది. అమెరికా తర్వాత అత్యధికంగా 3.4 కోట్ల పైగా కోవిడ్‌ కేసులు వచ్చింది మన దేశంలోనే. అమెరికా, బ్రెజిల్‌ తరువాత అధికంగా 4.52 లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయిందీ భారత్‌లోనే. క్లిష్టమైన ఈ ప్రయాణంలో ప్రాణాంతక వైరస్‌ నుంచి దేశం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ప్రజారోగ్యంపై, ప్రాథమిక ఆరోగ్య వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకులకు మరోసారి గుర్తొచ్చింది. లాక్డౌన్‌లు, వలస జీవుల వెతలు, దెబ్బతిన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థల నడుమనే సమష్టి కృషితో దేశం కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. 278 రోజుల్లో ఇలా శతకోటి డోసులు పూర్తయ్యాయంటే, సగటున రోజుకు 36 లక్షల టీకాలు వేసినట్టు లెక్క. కానీ, జనవరి నుంచి చూస్తే, ఏప్రిల్‌, సెప్టెంబర్‌ వగైరాల్లో టీకాపక్రియ వేగవంతం కావడం, అనేక కారణాలతో మధ్యలో మందకొడిగా సాగడం గమనార్హం. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజైన సెప్టెంబర్‌ 17న రికార్డు స్థాయిలో 2 కోట్లకు పైగా డోసులు పడ్డాయి. డిసెంబర్‌ ఆఖరుకు అర్హులైన భారతీయులందరికీ టీకా అనే లక్ష్యం సాధించాలంటే, ఇకపై రోజూ 1.2 కోట్లకు పైగా డోసులు వేయాలి. అలాగే, పిల్లలు, యువకులకు ఇప్పటికీ టీకాలు వేయాల్సి ఉంది. 12 ఏళ్ళు పైబడిన వారందరికీ తొలిసారిగా సూదితో అవసరం లేని జైకోవ్‌`డి టీకాను దేశీయంగా రూపొందించడం ఒక శుభసూచకం. అయితే, ఇప్పటికీ పట్టణ, గ్రావిూణ ప్రాంతాల మధ్య, అలాగే స్త్రీపురుషుల మధ్య టీకా వేయడంలో అంతరం ఆలోచించాల్సిన విషయం. పురుషులతో పోలిస్తే 6 శాతం తక్కువ మంది స్త్రీలు టీకాలు వేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే
చెబుతున్నాయి. ఈ అంతరాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్‌ కేసులు రోజూ సగటున 20 వేల లోపే ఉండడం, తెలుగు రాష్టాల్రు రెండూ కలిపినా వెయ్యి లోపలే కేసులు నమోదవుతుండడం సంతోషించదగ్గ విషయమే. తొలి డోసు తర్వాత నిర్ణీత గడువు దాటినా కొన్ని లక్షల మంది రెండో డోసు వేసుకోకపోవడం ఆందోళనకరం. అలాగే, షరతుల సడలింపులతో కోవిడ్‌ నిబంధనల్ని గాలికి వదిలేయడం ఇప్పటికే ఎక్కువైంది. మాస్కులు, భౌతిక దూరాలు మానేయడం మనకే ముప్పుగా గుర్తించాలి. మాస్కులు ధరించడం… గాలి, వెలుతురు ఉండే చోట పనిచేయడం… కరోనాకు పండగగా మారే ఉత్సవాలకు దూరంగా ఉండడమే అసలు టీకా అని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. వేరియంట్లకు వ్యాక్సిన్లు, మ్యూటెంట్లకు మాస్కులు ఇదే రక్షణ మంత్రం అన్నది నిపుణుల నినాదం. శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ప్రపంచం విూద దాడి చేసింది. ఈ మమమ్మారిని అడ్డుకునేందుకు భారత్‌ వ్యాక్సిన్‌లను ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి. శాస్త్రీయ దృక్పథంతో వ్యాక్సిన్‌ పంపిణీ చేశాం. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సామం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉందని నిర్లక్ష్యం వద్దు. కరోనా ఇంకా కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రతిన పూనాలి.