శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందా శెట్టిపై లక్నోలో చీటింగ్‌ కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో శిల్పాశెట్టి ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి శిల్పాశెట్టి చైర్మన్‌గా…ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ ఫిట్‌నెస్‌ సెంటర్‌ ఫ్రాంచైజీని ఇస్తూ, లక్నోలో ఓ సెంటర్‌ను ప్రారంభించడానికి జోత్న్స చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ దగ్గర కోట్ల రూపాయల డబ్బును శిల్పాశెట్టి, ఆమె తల్లి తీసుకున్నారు. అయితే ఫిట్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించకుండా మోసం చేశారంటూ బాధితులు కేసు పెట్టారు. దీంతో లక్నో
పోలీసులు శిల్పాశెట్టి, సునందా శెట్టిలను విచారించడానికి ముంబై చేరుకున్నారు. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.