సభాపతి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు :పోచారం సురేందర్ రెడ్డి

రుద్రూర్(జనంసాక్షి): మంగళవారం రోజున
రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో లో 5మంది లబ్ధిదారులకు శాదిముభారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల నాయకుల తో కలిసి పోచారం సురేందర్ రెడ్డి పంపిణి చేయడం జరిగింది. అంతే కాకుండా 10లక్షల నిధులతో గౌడ్ సంఘ భవనానికి భూమిపూజ, 10లక్షల నిధులతో ప్రైమరీ హేల్త్ సెంటర్ నూతన భవనకి భూమి పూజ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మత్తులు చేయడానికి అదనపు సదుపాయాల కొరకు
15లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు
ఈ సందర్బంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెరాస ప్రభుత్వం రుద్రూర్ మండలానికి 914 లబ్ది దారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిందని తెలిపారు. సీఎం కెసిఆర్ మరియు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వలన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. సభాపతి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం పని చేస్తున్నారు అని తెలిపారు.
తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, మెడికల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్ మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, మాజీ విండో చైర్మెన్ పత్తి రాము, కటికే రామరాజ్ , షేక్ మస్తాన్ , ఆసియా కౌసర్, కలీమ్,వార్డ్ సభ్యులు, రమేష్, గులాబ్, నాగభూషణం, లాల్ మొహమ్మద్, కిషోర్, అంజయ్య రుద్రూర్ తెరాస నాయకులు లబ్ధిదారులు పార్టీ కార్యకర్త నాయకులు పాల్గొన్నారు.