సర్వ జనహిత పిత మన కేసీఆర్..

సర్వ మతాలకు, కులాల సన్నిహితుడు మన సీఎం కేసీఆర్. ఈ మతం, ఆ కులం అనే భావన ఆయనలో లేని నిజం. అందరికీ ప్రేమను పంచే అందరివాడు. గొప్ప లౌకికవాది సీఎం కేసీఆర్. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కొన్ని అంశాల్లో  నాయకుడిగా మాట్లాడినప్పుడే తప్ప… వ్యక్తిగా సమాజ హితం కోరే నేతగా మనసులో పెట్టుకోకుండా ప్రేమిస్తాడు, ఆదరిస్తారు. ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడం ఆయన అందరికంటే ముందుంటారు. దానగుణంలో కెసిఆర్ ని మించిన నాయకుడు లేరు. ఉదారంగా, మానవీయ కోణంలో ఆలోచిస్తారు. చింతమడకలోని తన వారసత్వ ఆస్తులను ప్రజా అవసరాల కోసం అప్పగించడం  ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు దావఖానాకు  దానంగా ఇచ్చారు. నిత్యం తెలంగాణ ప్రజల కోసం పాటుపడే నేత కేసీఆర్ ను  తెలంగాణ సమ సమాజం జాతిపితగా  కీర్తిస్తారు. తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినప్పుడు సైతం అందరిని సంప్రదించి తెలంగాణ గులాబీ జెండా ఎత్తారు. తాను ఒక్కడే బయలుదేరి   తెలంగాణ  కోసం అందరిని ఒక్కతాటిపై తెచ్చారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలను,  సంఘాలను,   నాయకులను ఏకతాటిపైకి తెచ్చి  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి  తెలంగాణ తెచ్చిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్.. ఇప్పుడు ఎనిమిదేళ్లుగా తెలంగాణ  బంగారు తెలంగాణ కావాలని అదే పంథా కొనసాగిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం అందర్నీ కలుపుకపోతున్నారు.  ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందని విషయంలో ప్రజాహితం కోరే ఆలోచన చేస్తారు. కులం, మతం వివక్షతకు తావు లేకుండా నిర్మలమైన మనసుతో తెలంగాణ నాయకుడిగా తెలంగాణ ముద్దుబిడ్డ దేశం గర్వించే నాయకుడిగా కెసిఆర్ తన పాలన కొనసాగిస్తున్నారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కెసిఆర్ ను మించిన లౌకికవాది లేడు అని చెప్పవచ్చు.  సర్వ మతాలను కులాలను  ప్రేమిస్తూ సర్వ జన హితం కోసం పరితపించే నాయకుడు కేసీఆర్ ఒక్కరే.  హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మతాల వంటి విషయంలో కానీ,  దళిత, గిరిజన, బిసి, మైనార్టీ, ఓసి  అనే తేడా  తెలంగాణ భూమిలో కనిపించదు. దేశంలో ఎక్కడ చూసినా కులం మతం అంటూ విడదీసి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇది నా పార్టీ,  ఈ పార్టీ ఆ పార్టీ,  నేనే, మేమె దేశం కోసం పుట్టినం.  దేశం కోసం తామే త్యాగం  చేస్తున్నమని కుళ్లు రాజకీయాలను చేస్తూ మతాల పేర, కులాల పేర చిచ్చు రేపి రాజకీయ పబ్బం గడుపుతున్న ఈ దేశంలో నాయకులు ఉండటం సిగ్గు చేటు.  కొందరైతే ఉన్మాదం సృష్టిస్తూ ఒక విధమైన భయం ఆందోళనకు గురి చేస్తూ దాడులు చేస్తారు.
 కానీ ఇటువంటి ఎప్పటికీ నిలబడలేనివి. మనిషిని మనిషిగా మనసుతో ప్రేమించినప్పుడు ప్రేమ, ఆప్యాయతల ముందు మతం, కులం కనబడవు. అందరూ బాగుండాలని కోరుకునుదే మతము, మతం తప్పు చేయాలని చెప్పదు,  ఏ కులం కొట్లాడుకోవాలని చూడదు.. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లో ప్రజలు క్షేమంగా కలిసి మెలిసి మంచిగా ఉండాలని బోధిస్తాయి.
 ఈ రోజు మన సీఎం కేసీఆర్ పాలనలో  తెలంగాణలో కల్యాణ లక్ష్మి,షాది ముబారక్, దళిత బంధు, రైతుబంధు, దళిత, బిసి, మైనార్టీ, గిరిజన గురుకుల పాఠశాలలు, కెసిఆర్ కిట్ వంటి అనేక సంక్షేమాభివృద్ది పథకాలు అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలలో… ఏ కులము, మతము  కనిపించదే.
 సర్వ జన హితం కోరే నేత కేసీఆర్ నుండి పుట్టిన గొప్ప సంక్షేమ పథకాలే ఇందుకు ఒక నిదర్శనం.
 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణం చేపట్టి దేశంలో గొప్ప ఆలయంగా ఆధ్యాత్మికంగా, ధ్యానమందిరంగా తీర్చిదిద్దుతున్నారు.  లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన దివ్యమందిరాన్ని చూసే గొప్ప అవకాశం మన సీఎం కేసీఆర్ ద్వారా లభించింది. వేములవాడ రాజన్న, భద్రాద్రి రామన్న, సమ్మక్క సారక్క, జోగులాంబ వంటి దేవాలయాలను  కోట్లది రూపాయలు కేటాయించి ఆలయాలను వైభోపేతంగా అభివృద్ధి పరుస్తున్నారు. అలాగే ముస్లిం మైనార్టీ ముస్లింల కోసం షాది దీఖానాలు, హజ్ హౌస్ లు, మసీదుల నిర్మాణాలు,   క్రైస్తవ భవనాలు , దళిత,  గిరిజన భవనాలకు నిధులు కేటాయించి నిర్మిస్తు వారి అభివృద్ధికి కోసం సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.  ఇట్ల అన్ని మతాలకు, కులాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోపాటు తెలంగాణలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ప్రతివారికి సంఘాల భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. తెలంగాణలో అందర్నీ సమానంగా ప్రేమగా కేసీఆర్ చూసుకుంటున్నారనడాని ఇదొక గొప్ప నిదర్శనం.
 కెసిఆర్  గొప్ప ఆధ్యాత్మిక, దైవభక్తి గల నాయకుడు కెసిఆర్. ప్రజల కోసం ఎన్నో యాగాలు, పూజలు చేసే గొప్ప మానవ మూర్తి. ఎన్నో దానధర్మాలు చేశాడు. తన రాజ్యంలో తన ప్రజలు గొప్పగా జీవించాలని కోరుకునే తత్వం రాజులాగా  తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునేది మన కేసీఆర్ ఆశయం..  ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడు పుట్టడం చాలా అరుదుగా  జరుగుతూ ఉంటుంది. తెలంగాణ వైతాళికుడిగా, కారణజన్ముడిగా ప్రజల కోసం జన్మిస్తారని కేసీఆర్ ను చూస్తే అర్థమవుతుంది.  బతుకమ్మ పండుగ వస్తే మన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు,  రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు, క్రిస్మస్ పండుగకు  కొత్త బట్టలు కానుకలు అందించి పర్వదిన పండుగను సంబరంగా జరుపుకునే ఆత్మీయ చేతులు మన కేసీఆర్ వి. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఒకటి రెండు పండుగ ఎలా జరుపుకుంటారు. మహిళా అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేపెట్టారు. మహిళా వికాసానికి సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి.. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా 10 లక్షల మంది అడ బిడ్డల పెళ్లిలకు అండగా నిలిచారు. కేసీఆర్ కిట్ ద్వారా 11 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. బీడీ కార్మిక మహిళలకు 2016 భృతి అందిస్తూ వారిలో అండగా నిలిచారు. ఆసరా పింఛన్ల ద్వారా అవ్వలకు, వితంతులకు బతుకు భరోసా కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. హాస్టల్ బాలికల విద్య కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నరు. పారిశుధ్య కార్మికులకు, డాక్టర్లకు, ఆశ వర్కర్లకు, ఏ ఎన్ ఎమ్ లకు, అంగని వడి కార్యకర్తలకు, అయాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా వేతనాలు పెంచారు.  రాజకీయ రంగంలో సైతం మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చారు.  స్థానిక సంస్థల, మార్కెట్ కమిటీల్లో  50 శాతం రిజ్వేషన్లను కల్పించారు. మహిళా పారిశ్రమికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుంది.. తెలంగాణ ప్రతి ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపిండు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా బంధు సంబరాలు నిర్వహిస్తూ మహిళా లోకానికి స్ఫూర్తి నిచ్చారు.  మనదేశంలో ఎన్నో రంగుల పండుగలు జరుగుతాయి. ప్రత్యేకంగా  తెలంగాణ నేల. విభిన్న సంస్కృతులు కలిసిపోయిన తెలంగాణ గంగా జమున, పాలు నీళ్లు కలిసిపోయి ప్రేమానురాగాలు పంచుకునే గొప్ప మట్టి పరిమళం మన తెలంగాణ గడ్డ. దేశంలో వివిధ ప్రాంతాల నుండి ఎంతోమంది హైదరాబాద్, తెలంగాణ చుట్టూ ఉంటూ మన అందరితో కలిసిపోయే విధంగా ప్రేమతో కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారు. అందుకే అంటారు తెలంగాణ సర్వ మతాలను ప్రేమించే మట్టి. అందరికి ప్రేమను పంచడంలో తనకు తానే సాటి కేసీఆర్ అందుకే సర్వ జనహిత పిత మన కేసీఆర్….  సీఎం  కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సంక్షేమాభివృద్ది దేశ సంక్షేమాభివృద్దికి బాటలు వేస్తుంది.. బంగారు భారత దేశం కోసం బయలుదేరుతున్న కేసిఆర్ కు తెలంగాణ సమాజం అండగా నిలివాలి.
చిటుకుల మైసారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, వ్యాసకర్త, సిద్దిపేట. సెల్:9490524724