సిఎం సహాయనిధి పేదలకు వరం

క్రిస్మస్‌ వేడుకల్లో దుస్తుల పంపిణీ
గజ్వెల్‌లో క్రిస్టియన్‌ భవన్‌ ప్రారంభించిన మంత్రి
సిద్దిపేట,డిసెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌ క్రిస్టియన్‌ భవన్‌ ఆవరణలో గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదలు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అందుకు గజ్వేల్‌ నియోజకవర్గమే నిదర్శనమన్నారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎప్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అన్నపూర్ణ, కైస్త్రవ మత ప్రతినిధి రూబెన్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, అదే విధంగా సీఎం కేసీఆర్‌ సర్వ మతాలను గౌరవిస్తారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్‌ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎప్డీసీ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 3,600 మంది పేద కైస్త్రవలకు దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రభుత్వం స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి కైస్త్రవ భవనం నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామన్నారు. ప్రతి యేటా క్రిస్మస్‌ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ªూయం అందించిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి చేయూత అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కైస్త్రవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్‌, సిద్దిపేటలో నిర్మించుకున్నామని, త్వరలోనే అన్ని నియోజకవర్గ పరిధిల్లో కూడా వస్తాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే కైస్త్రవ సమాధుల కోసం 5 ఎకరాల్లో స్థలాన్ని కేటాయిస్తామని, త్వరలోనే గజ్వేల్‌ లో హిందువులకు వైకుంఠ రథం తరహాలో కైస్త్రవులకు పరలోక యాత్ర వాహనాన్ని అందించే ఏర్పాటు చేస్తామని భరోసానిచ్చారు.