సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్

) సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజేవైయం జిల్లా అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ యువకులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన నేటి వరకు అది అమలు కాలేదు అన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగు నియమాకాలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించి ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మార్వో తిరుపతయ్య కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా నాయకులు వావిళ్ళ రవీందర్ రెడ్డి, నీలవర్ధన్ రెడ్డి, పూల శీను తదితరులు పాల్గొన్నారు.