సోలార్‌ విద్యుత్‌ తో పెరిగిన ఉత్పత్తి : మంత్రి జగదీశ్‌ రెడ్డి


నల్లగొండ,సెప్టెంబర్‌30 (జనం సాక్షి) : సోలార్‌ పవర్‌ స్థాపనలో తెలంగాణ అగ్రభాగాన ఉంది. దీనిని వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తోంది. సోలార్‌ ప్లాంట్లపై అధ్యయనం జరుగు తోందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి గతంలో అసెంబ్లీలో చెప్పారు. సోలార్‌ టెండర్లు పిచిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు.వచ్చే ఆరు నెలల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానం నిలవబోతున్నదని పేర్కొన్నారు. రైతులకు విద్యుత్‌ కష్టాలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. సోలార్‌ టెండర్లు పిలిచిన తొలి రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. రైతులకు నిరంతర విద్యుత్‌ ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్‌ ప్లాంట్లపై అధ్యయనం జరుగుతోందని, ఇది కార్యరూపం దాల్చితే తగు చర్యలు తీసుకుంటామన్నారు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానం నిలవబోతు న్నదని చెప్పారు. ఇదిలావుంటే నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిమ్మకాయల మార్కెట్‌ నిర్మిస్తామని మార్కెటింగ్‌ మంత్రి పేర్కొన్నారు. 3,400 హెక్టార్ల పరిధిలో నిమ్మ సాగును చేస్తున్నారని తెలిపారు. 15 టన్నుల నిమ్మను ఉత్పత్తి చేస్తున్నారు. నిమ్మ రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిమ్మ కాయల మార్కెట్‌ కోసం రూ. 3 కోట్ల 7 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. మార్కెట్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్‌ను ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తామన్నారు. నిమ్మకాయల మార్కెట్‌ను అక్కడ నిర్మించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.