స్వచ్ఛతతోనే పరిశుభ్రత

అంటువ్యాధులకు దూరంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జనంసాక్షి) : స్వచ్చత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటుకుంటే తప్ప అంటువ్యాధులకు దూరంగా ఉండలేమని జిల్లా వైద్యాధికారి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను
అలవర్చుకోవాలని, అందుకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు. గ్రామాల్లో స్వచ్చపక్వాడలో భాగంగా ప్రదర్శన నిర్వహించి గ్రామస్థులకు సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఆమె సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు కూడా ఇస్తున్నందున ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వందశాతం స్వచ్చగ్రామాలను నిర్మించుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. స్వచ్చభారత్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రజలకు సహకరిం చాలని అన్నారు. అలాగే ప్రధానంగా మహిళలు స్వచ్ఛత కార్యక్రమానికి ముందడుగు వేయాలని పేర్కొన్నారు. స్వచ్ఛత ఉంటేనే మనవద్దకు రోగాలు దరిచేరవన్నారు. మహిళలంతా కట్టుబడి ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు.