స్వశక్తి గ్రూపు సభ్యులను కమిషన్ల పేర వేధిస్తున్న మెప్మా ఆర్.పి లపై కఠిన చర్యలు తీసుకోవాలి ——- ఐద్వా జిల్లా కమిటీ డిమాండ్

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
స్వశక్తి శ్రీనిధి మహిళా గ్రూపుల నుండి కమిషన్ పేరిట వసూల్లకు పాల్పడుతున్న అర్.పి లపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగరాణి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మోప్మా) జిల్లా అధికారి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కోనేటి నాగరాణి మాట్లాడుతూ
కరీంనగర్ జిల్లాలో అర్బన్ మరియు రూరల్ గ్రామాలలో ఆర్.పి లు స్వశక్తి గ్రూపులకు లోన్లు ఇప్పిస్తామని ఒక్కొక్క గ్రూప్ సభ్యుల నుండి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తూ గ్రూపు సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. స్వశక్తి గ్రూపులకు ఆర్పీలు శ్రీనిధి లోన్ల పేరిట మామూలు వసూలు చేస్తున్నారని, మేము ఇవ్వము అని ఎదురు తిరిగినందుకు బ్యాంకు నుండి లోన్ ఇప్పియడంలో జాప్యం చేస్తున్నారని, బ్యాంకు కెళ్ళి అడిగితే మీ ఆర్ పి వస్తేనే లోన్లు ఇస్తామని బ్యాంకు మేనేజర్లు చెప్తున్నారు. స్వశక్తి సంఘాలు ఆర్పి కి డబ్బులు ఇవ్వలేక ఇటు లోను రాక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్యులు,పేదవారు గ్రూప్ లోన్లు తెచ్చుకొని వారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి పేద వారినీ కమిషన్లు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ అక్రమంగా దోచుకుంటున్న ఆర్పిల నుండి స్వశక్తి సభ్యులను కాపాడి,అవినీతి అక్రమాలను అరికట్టాలని కోరారు. జిల్లా అధికారి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు ద్యావ అన్నపూర్ణ,జిల్లా ఉపాధ్యక్షురాలు మాదసి యమునా,A.రజిత తదితరులు పాల్గొన్నారు.