హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

అధికార పార్టీ తీరుపై ఓయూ జెఎసి మండిపాటు
కరీంనగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్‌ సురేష్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 72 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసిన హుజురాబాద్‌ లో ఓటర్లను గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ప్రలోభ పెడుతున్నారని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి పోలింగ్‌ బూత్‌లలో తిరుగుతూ ఓటర్లను భయభ్రాతులకు గురి
చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని,టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కావాలనే గొడవలకు దిగుతున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుండడంతో ఓర్వలేక, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు బీజేపీ కార్యకర్తలే పోలింగ్‌ బూతుల వద్ద ప్రచారం చేస్తూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారని షో క్రియేట్‌ చేస్తున్నారు. అయినా, ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 45.65 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. ఓటర్లలో ఈ మార్పును జీర్ణించుకోలేని బీజేపీ నేతలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఓపికతో వ్యవహరిస్తూ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు జరిగినా.. ఇరు వర్గాలను చెదరగొట్టి స్థానిక ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు. ఈసారి ఓటింగ్‌ శాతం పెంచి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు.