42వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)
 వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట ఆదర్శ కాలనీలోని   ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్  బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు.
              ఈ సందర్భంగా  కార్పొరేటర్ మాట్లాడుతూ  డివిజన్లోని తెలుపు రేషన్ కార్డు కలిగిన మహిళలందరికీ బతుకమ్మ చీరలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క బతుకమ్మ చీరలను ఈరోజు (సోమవారం) నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మెప్మాకు చెందిన ఆర్ పి ల ద్వారా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఆదర్శ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి రేషన్ షాపు వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఒక ఆర్ పి ని ఇన్చార్జిగా వేయడం జరిగిందని మహిళలు అందరూ కూడా వారు ఏ రేషన్ షాప్ క్రిందికి అయితే వస్తారో  దానికి సంబంధించిన కౌంటర్ వద్దకు వెళ్లి బతుకమ్మ చీరలను పొందాలని గుండు చందన పూర్ణచందర్ కోరారు.
           ఈ కార్యక్రమంలో మెప్మాకు చెందిన సి ఓ ప్రవీణ్, ఆర్ పి ఎలుగు రమ, బజ్జూరి సురేఖ, చిమ్మని భార్గవి, బండారి శ్రీకల, మాడిశెట్టి కవిత, బక్కి రమాదేవి, కైరంకొండ మహేశ్వరి  తదితరులు పాల్గొన్నారు.