అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

రాజమండ్రి : పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను రాజమండ్రి అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 72 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో రాజమండ్రి, అమలాపురం, ఉండ్రాజవరం, ఏలూరు ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించారని పేర్కొన్నారు. పాలకొల్లుకు చెందిన ఈతకోట రాజ్‌కుమార్‌ ముఠాకు నాయకుడని తెలిపారు. పగలుసమయంలో చోరీలక పాల్పడటం వీరి ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు. రాజమండ్రి మధ్య మండలం డీఎస్పీ బాబ్జి ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.