అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి : విజయమ్మ

హైదరాబాద్‌ : అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్‌ సంక్షేమ పథకాలకు అంబేద్కర్‌ ఆశయాలే మార్గదర్శమని వైఎస్‌ విజయమ్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.