అంబేద్కర్‌ యూనివర్శిరటీలో సహ చట్టంపై సదస్సు

హైదరాబాద్‌ : నగరంలోని బీఆర్‌ అంబేద్కర్‌ దూరవిద్య విశ్వవిద్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు ప్రారంభమైంది. మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సును రాష్ట్ర సమాచార కమిషన్‌ విజయబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సహ చట్టం లక్ష్యం నెలవేరడానికి ఇలాంటి అవగాహన సదస్సును దోహదపడతాయని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు వివరించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టం లక్ష్యం నెరవేరినప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయన్నారు.