అక్టోబరు 2వ తేదీన విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక

హైదరాబాద్‌: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం అక్టోబరు 2వ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సభ్యత్వం, ఇటీవల జరిగిన గురజాడ జయంతి వేడుకల గురించి సమీక్షిస్తామన్నారు.