అక్బరుద్దీన్‌పై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులో జనార్దన్‌ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఎల్బీనగర్‌ పోలీసులను ఆదేశించింది. అక్బరుద్దీన్‌పై 121,295(ఎ),153 (ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.