అక్బరుద్దీన్‌ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

హైదరాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్‌, నిర్మల్‌ పోలీసులు నోటీసులు  జారీ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన జిల్లా పోలీసులు అక్బరుద్దీన్‌ లేకపోవడంతో బంజారాహిల్స్‌లోని ఆయన  ఇంటికి నోటీసులు అంటించారు.