అక్బరుద్దీన్‌ కోర్టు హాజరుకు 24కు వాయిదా

నిజామాబాద్‌, జనవరి 19 (): వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరు పరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పొడగించింది.అక్బరుద్దీన్‌ హాజరయ్యేందుకు గడువు పొడగిస్తూ మొదటిఅదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19 లోగా కోర్టు ముందు అక్బరుద్దీన్‌ను హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టుకు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా మరికొన్ని రోజులు గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి ఈ అవకాశాన్ని కల్పించారు. జిల్లాలో అడిషనల్‌ డిజిపి గోపాల్‌రెడ్డి అధికారిక పర్యటన నిమిత్తం సందర్బంగా ఓవైసీని అరెస్టు చేస్తే బందోబస్తు విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయన్న అనుమానంతో పోలీసులు  కోర్టును ఆశ్రయించారు.