అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది
హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో నల్లధనం మరింత పెరిగిందని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న ఆక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అన్ని విషయాల్లో సామాన్య ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.



