అక్రమ కలప సాధీనం

కుంటాల : ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల మండలంలోని నందన్‌ బస్టాండ్‌ సమీపంలో ఈ ఉదయం అక్రమంగా కలప తరలిస్తున్న వాహనం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ సుమారుగా రూ. 50 వేలు ఉంటుందని చెప్పారు. వాహనం బోల్తా పడిన వెంటనే స్మగ్లర్లు పారిపోయారని తెలిపారు.