అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం
హైదరాబాద్: శేరిలింగంపల్లి, అంజయ్యనగర్, సిద్ధిక్నగర్లలో ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. భారీ పోలీసు భద్రత మధ్య ఈ ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు 35 అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే స్థానికులు అధికారుల చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించి వాగ్వాదానికి దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త, పరిస్థితి నెలకొంది.



