అక్షరాస్యతలో వెనకబడిపోయాం : రాష్ట్రపతి

లూథియానా : ఒకప్పుడు నాగరికత వెల్లివిరియడానికి తోడ్పడిన భారతదేశం నేడు విద్య, విజ్ఞానం, అక్షరాస్యతల్లో ఎంతో వెనుకబడి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. లూదియానాలో ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యతే దేశం ముందున్న పెను సవాలని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం నిరక్షరాస్యులు మనదేశంలోనే ఉన్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. పాఠశాలలోని జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఉపాధ్యాయులను గౌరవించాలని, బుద్ధిగా చదువుకోవాలని సూచించారు.