అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవదహనం

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌ యార్డులో ఈ  ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మార్కెట్‌ యార్డ్‌లో  పనిచేస్తున్న నర్సింహారావు (45) అనే వికలాంగుడు తొందరగా ప్రమాదం నుంచి బయటకి రాలేక మంటల్లో చిక్కుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనాస్థలికి చేరుకున్నా  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.