అడుగంటిన ప్రకాశం బ్యారేజీ
విజయవాడ: విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం మరోసారి పూర్తిగా అడుగంటింది. దీంతో నీటిమట్టం 10.7 అడుగులకు పడిపోయింది. ఎగువ నుంచి నీరు వచ్చే ఆశలు సన్నగిల్లడంతో కాల్వలు కట్టేసేయోచనలో నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. డుల్టాలో ఇప్పటికే వర్షాధారంగా నాట్లు వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి రెండు నెలలపైగా నికర జలాలు రావడం లేదు. ప్రస్తుతమైనా సాగర్‌నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు విడుదల చేసి తద్వారా కృష్ణా డెల్లా ఆయకట్టుని ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.



