అధికార పార్టీలో ఉండి కవాతుకు అనుమతి తీసుకురాలేనందుకు సిగ్గుగా లేదా: భాజపా
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా తెలంగాణ కవాతుకు అనుమతి విషయాన్ని పున:క్షించాలని భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్ రాజేశ్వరరావు కోరారు. శుక్రవారమిక్కడ పార్టీ నాయకలు దాసరి మల్లేశం, హనీఫ్ అలీ, రాములుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30న సాయంత్రం వరకూ గణేష్ నిమజ్జనం జరుగుతుందంటూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఆయన డీజీపీ పదవికి అనరుహడని అన్నారు. అధికార పార్టీలో ఉండి కూడా కవాతుకు అనుమతి తీసుకురాలేకపోయినందుకు సిగ్గనిపించడం లేదా. అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. అనుమతి ఇవ్వకుంటే ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని రాజేశ్వరరావు ప్రశ్నించారు.



