అనంత భాగ్యం ఎవరికి దక్కేనో…?
అనంతపురం,నవంబర్22(: టిడిపికి మరోమారు ఆదరణ పెరుగుతందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అనంత జిల్లాలో అనంతపురం,హిందూపురం పార్లమెంటు స్థానాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి. హిందూపురం నుంచి పోటీకి బాలయ్య సై అంటే ఇక్కడి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు- అనంతపురం పార్లమెంటు- స్థానం నుంచి పోటీ- చేసే అవకాశం ఎవరికి లభిస్తుందోననే విషయం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసి ప్రజల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ప్రభాకర్ చౌదరికి అనంతపురం పార్లమెంటు- స్థానం నుంచి పోటీ- చేసేందుకు పార్టీ అధిష్ఠానం నుంచి హావిూ ఉన్నట్లు- ప్రచారంలో ఉంది. అయితే బాలక్రిష్ణ హిందూపురం నుంచి పోటీ-కి సిద్ధమైతే అదేసామాజికవర్గానికి చెందిన ప్రభాకర్ చౌదరికి అవకాశం దక్కక పోవచ్చునని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మరోసారి కాల్వు శ్రీనివాసులుకే ఆ అ వకాశం లభించినా ఆశ్చర్యం లేదంటున్నారు. లేని పక్షంలో ఇద్దరినీ కాదని మరో అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో అనంత పార్లమెంటు స్థానం నుంచి కాల్వ శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనను గుంతకల్లు నుంచి శాసనసభకు పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా గుంతకల్లులో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా 2009 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తల్లో కొంతమేరకు నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ తరువాత నిర్వ హించిన కార్యక్రమాల ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపినట్లయింది.



