అనారోగ్యంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మృతి

మహబూబాబాద్‌ :మండలంలోని రజాల్‌ పేటలో ఎన్‌ఆర్‌ఈజీఎన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎన్‌. విమల(32) అనారోగ్యంతో మృతి చెందింది. వారంరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.