అనుకున్న తేదీల్లోనే తెలుగు మహాసభలు

తిరుపతి: ప్రపంచ మహాసభల ప్రధాన వేదికతో పాటు ఉపవేదికలుగా తిరుపతిలోని పశువైద్యకళాశాల, వ్యవసాయ కళాశాల మైదానాలు, పరిసర ప్రాంతాలు ఉంటాయని సాంస్కృతికి శాఖ కార్యదర్శి బలరామయ్య తెలిపారు. ఇవాళ తిరుపతిలో మహాసభలు జరిగే సభాస్థలిని ఆయన పరిశీలించారు.అనుకున్న తేదీల్లో అనుకున్న  ప్రకారం మహా సభలు జరుగుతాయని, గందరగోళం కానీ అధికారుల మధ్య సమన్వయలోపం కానీ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. వేదికల కోసం టెంట్ల  నిర్మాణ పనులు రేపట్నుంచి ప్రారంభమౌతాయని తెలిపారు. వర్షాల కారణంగా నమోదు చేసుకునే ప్రతినిధులు  వెనక్కితగ్గారని ఇప్పటికి దాకా కేవలం 4 వేల మంది ప్రతినిధులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.