అనుమంచిపల్లిలో లగడపాటి అరెస్టు

కృష్ణా : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసులు అరెస్టు చేస్తారన్నా ఉద్ధేశంతో లగడపాటి ఇంటోలోనే ఉండి తలుపులు వేసుకున్నారు. ఈ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను చేపట్టిన కనువిప్పు యాత్రను అడ్డుకునేందుకు తెదేపా నేతలు పోలీసులకు పదేపదే ఫోన్‌ చేశారని లగడపాటి అన్నారు.