అనుమానంతో భార్య హత్య : భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

రాజమండ్రి : భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందినా అల్లవరం మండలం గోపాయలంక గ్రామానికి చెందినా వీరభధ్ర రావు అనే వ్యక్తి తన భార్య సీతామాహలక్ష్మి అనుమానంతో రోకలి బండతో కోట్టి దారుణంగా హత్య చేశాడు. ఇది 2010లో ఫిబ్రవరిలో జరిగింది. కుటుంబసభ్యులు, ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన వాంగ్ములాన్ని వాదపు..వాదనలు విన్నతర్వత అనంతరం జిల్లాజడ్జి రాజు వీరభధ్ర రావుకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చేప్పారు… అయితే హైకోర్టుకు వేళ్ళే వేసులుబాటును వీరభధ్రకు అమలాపురం జిల్లాజడ్జి రాజు కల్పించారు..