అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలి : కొండ్రు

శ్రీకాకుళం : తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని మంత్రి కొండ్రు మురళి కోరారు. కాంగ్రెస్‌తో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఎవరు మాట్లాడినా అది తమ వ్యక్తిగత అభిప్రాయం కిందే పరిగణించాలని సూచించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపచేయడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు.