అ’పూర్వ’ సమ్మేళనం

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు19(జనంసాక్షి): సియస్‌ఐ స్కూల్‌ 1975 వ బ్యాచ్‌ ఎస్‌ఎస్‌సి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నగరంలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి చిన్ననాటి స్నేహితులు అందరూ ఒకే దగ్గర చేరి హంగామా చేశారు. దశాబ్ధాల క్రితం విడిపోయిన స్నేహితులు ఒకేదగ్గర కలుసుకోవడంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు. ఒకరినొకరు పలకరించుకొని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారు పాత జ్ఞాపకాలను తలచుకుంటు మదుర స్మృతులను పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఆద్యంతం ఆత్మీయ అనురాగాలతో కార్యక్రమాన్ని జరుపుకున్నారు. వారి గురువైన జ్ఞాన ప్రకాష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చార్టెడ్‌ అకౌంటెంట్‌ సాయిలేఖర్‌ రాజు, ఆర్టీసీ అధికారి రవీందర్‌, విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌ జి హరికిషన్‌ రావు , ఆర్‌ అండ్‌ బి సిరిసిల్లా సురెేందర్‌ రెడ్డి, ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ అధికారి జోసెఫ్‌ సుశిల్‌ కుమార్‌, జార్జి ప్రసన్న, కళావతి, పామరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు.